మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఇలా వాడుకోవచ్చు!

మీ పాత మొబైల్‌ను సెక్యూరిటీ కెమెరాలా మార్చుకోవచ్చు. దీని కోసం కొన్ని యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Image: Pixabay

గేమ్‌లు ఎక్కువగా ఆడితే ఫోన్‌లో త్వరగా ఛార్జింగ్‌ అయిపోవడంతో పాటు వేడెక్కుతుంది. అందువల్ల పాత మొబైల్‌ను కేవలం గేమ్స్‌ కోసమే వాడుకోవచ్చు.

Image: Pixabay

చాలా ల్యాపీల్లో కెమెరా క్లారిటీ సరిగా ఉండదు. అలాంటప్పుడు పాత ఫోన్‌ను వైర్‌లెస్‌ వెబ్‌క్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు.

Image: Pixabay

అన్ని మొబైళ్లలో కాకపోయినా కొన్నింటిలో ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఆపరేట్‌ చేసే సౌకర్యం ఉంటుంది. మీ పాత ఫోన్‌ను స్మార్ట్‌ రిమోట్‌గా వాడొచ్చు.

Image: Pixabay

మీరు చదవాలనుకున్న పుస్తకాలన్నింటినీ డౌన్‌లోడ్‌ చేసుకొని మీ పాతఫోన్‌ను ఈ-బుక్‌గా మార్చుకోవచ్చు.

Image: Pixabay

పాటలు వినడానికి మ్యూజిక్‌ ప్లేయర్‌గా మీ పాత ఫోన్‌ ఉపయోగపడుతుంది.

Image: Pixabay

ఆన్‌లైన్‌ తరగతుల కోసం పిల్లలకు ఇవ్వొచ్చు. వారికి ఈ మొబైల్‌తో ఫొటోగ్రఫీ నేర్పించొచ్చు.

Image: Eenadu

కారులో జీపీఎస్‌ ట్రాకర్‌లాగా పాత ఫోన్‌ను ఫిక్స్‌ చేసుకోవచ్చు.

Image: Pixabay

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home