అరటిపండుతో బరువు తగ్గడమా..?

అరటిపండుతో బరువు తగ్గొచ్చని తెలుసా? అదేంటి అది తింటే బరువు పెరుగుతాం కానీ.. ఎలా తగ్గుతాం అంటారా.. అదెలాగో చూడండి.

(photos:unsplash)

సాధారణంగా రోజుకి ఒకటి లేదా రెండు అరటిపండ్లు మాత్రమే తీసుకోవాలి. ఒక వేళ అంతకు మించి తీసుకుంటే అప్పుడు అవి బరువు పెరిగేందుకు దారి తీస్తాయి.

ముఖ్యంగా బరువు తగ్గాలని అరటిపండు తీసుకోవాలనుకుంటే.. అందుకు ఉదయం మాత్రమే సరైన సమయం. ఇది తగినంత శక్తిని అందిస్తుంది.

అరటిపండు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రిస్తుంది. ఒక్క అరటిపండు తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. చాలాసేపటి వరకు ఆకలి వేయదు.

పొట్ట దగ్గరున్న కొవ్వును కరిగించేందుకు అరటిపండు సహాయపడుతుంది. దీంట్లో అధిక మొత్తంలో ఫైబర్‌ ఉంటుంది. అది పేగులను శుభ్రం చేసి మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది.

బాగా పండిన వాటికంటే కొంచెం పచ్చిగా ఉన్న కాయలు తొందరగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. అందుకే, అప్పుడప్పుడు అరటికాయను కూరగా వండుకొని తింటుండాలి.

ఉదయం 10 తర్వాత చేసే బ్రేక్‌ఫాస్ట్‌లో నూనెతో చేసినవి తీసుకోకూడదు. తేలికగా జీర్ణం అయ్యేలా ఓట్‌మీల్‌తో పాటు ఒక అరటి పండు తీసుకుంటే సరి. దీంట్లో ఉండే పొటాషియం రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

మధుమేహం ఉన్నవారు మాత్రం అరటిపండ్లకు దూరంగా ఉండాలి. బరువు తగ్గడం పక్కన పెడితే వీటిల్లో ఉండే గ్లూకోజ్‌ కారణంగా షుగరు లెవెల్స్‌ పెరుగుతాయి.

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

ఎందుకొచ్చిందీ తలనొప్పి?

Eenadu.net Home