వ్యాయామానికి ముందు/తర్వాత ఏం తినాలి?
వ్యాయామం చేసేటప్పుడు మనకు శక్తి ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుంది.
Image: Pixabay
వ్యాయామానికి ముందు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకొని ఆ తర్వాత కసరత్తులు ప్రారంభించాలి.
Image: Pixabay
ఉదయమైతే అల్పాహారంగా అరటిపండు, ఆపిల్, బెర్రీస్, స్వీట్ పొటాటో వంటివి తీసుకోవచ్చు.
Image: Pixabay
ఇతర వేళల్లో బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్, ఓట్ మీల్ వంటివి ఎంచుకుంటే.. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు లభిస్తాయి.
Image: Pixabay
తిన్న తర్వాత వ్యాయామం చేయడానికి 30 నుంచి 40 నిమిషాల గ్యాప్ తీసుకోవాలి.
Image: Pixabay
వ్యాయామానికి ముందు కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీన్ ఫుడ్ తినాలి.
Image: Pixabay
వ్యాయామం తర్వాత ప్రోటీన్ ఉన్న ఆహారంతో పాటు మొలకెత్తిన గింజలు తీసుకోవాలి.
Image: Pixabay
పెరుగన్నంలో పండ్ల ముక్కలను కలిపి తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి శరీరానికి అందుతుంది.
Image: Pixabay
వ్యాయామానికి ముందు, మధ్యలో.. తర్వాత నీళ్లు తీసుకోవడం మంచిది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం.
Image: Pixabay