నిద్ర పోవడానికి ముందు చేయకూడని పనులు
రాత్రి పూట వ్యాయామం చేయకూడదు. చేస్తే శరీరం ఉత్తేజితమై నిద్ర పట్టదు.
image:pixabay
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం మానుకోవాలి. ఆలస్యంగా తింటే ఆహారం సరిగా జీర్ణంకాదు.. కడుపు ఉబ్బరంగా మారి నిద్ర దూరం అవుతుంది.
image:pixabay
పడుకునే ముందు కనీసం మూడు గంటల ముందు భోజనం చేయాలి. అప్పుడే కడుపు తేలికై హాయిగా నిద్ర పడుతుంది.
Image:Eenadu
రాత్రివేళ దంతాలు శుభ్రం చేసుకోవాలి. లేదంటే దంతాల మధ్య పాచి పేరుకుపోయి బ్యాక్టీరియా చేరి నిద్రకు భంగం కలిగిస్తుంది.
image:pixabay
ఆల్కహాల్ వల్ల నిద్ర మత్తు ఉంటుంది కానీ, ప్రశాంతంగా నిద్ర పట్టదు. మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
image:pixabay
నిద్రపోవడానికి 6 నుంచి 8 గంటల ముందు టీ, కాఫీలు తీసుకోకూడదు. రాత్రి వేళ టీ/కాఫీ తాగితే వాటిలోని కెఫెన్ వల్ల నిద్ర పట్టదు.
image:pixabay
నిద్రకు ఉపక్రమించే ముందు పడక గదిలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను దూరంగా పెట్టాలి.
image:pixabay
బెడ్‌రూమ్‌లో లైట్స్ అన్నీ ఆన్ చేసి పెట్టొద్దు. ఆ వెలుతురుకి నిద్ర అస్సలు పట్టదు. కొద్ది మందికి మాత్రం లైట్స్ ఆన్‌లో ఉంటేనే నిద్ర పడుతుంటుంది.
image:pixabay