ఇటీవల వాట్సాప్ తెచ్చిన కొత్త ఫీచర్లివే!
వాట్సాప్ తమ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కాలంలో తీసుకొచ్చిన ఫీచర్లివీ!
image:RKC
This browser does not support the video element.
వీడియో కాల్స్..
వాట్సాప్‌లో ఒకేసారి 8 మంది మాత్రమే వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఇటీవల ఆ సంఖ్యను 32కి పెంచారు.
image:whatsapp
ఒకసారి చూశాక ఆ ఫొటో, వీడియో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ‘వ్యూ వన్స్’ ఫీచర్‌ను కూడా వాట్సాప్ ఈ ఏడాదే తీసుకొచ్చింది.
image:whatsapp
‘డిస్‌అపియరింగ్ మెసేజస్’ ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్లు పంపే మెసేజ్ వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. ఎన్ని రోజులకు డిలీట్ అవ్వాలనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు.
image:RKC
This browser does not support the video element.
వాట్సాప్‌లో ఇప్పుడు మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు. దీని కోసం సెల్ఫ్ మెసేజ్ ఆప్షన్‌ను ఇటీవల తీసుకొచ్చారు. కాంటాక్ట్ లిస్ట్‌లో టాప్‌లో You అని మీ పేరు పక్కన కాంటాక్ట్ కనిపిస్తుంది.
image:whatsapp
ఏదైనా విషయమై గ్రూపు సభ్యుల అభిప్రాయం తెలుసుకోవడానికి వాట్సాప్‌లో పోల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
image:whatsapp
This browser does not support the video element.
వాట్సాప్ ప్రొఫైల్ ఎవరెవరు చూడాలనుకుంటారో వాళ్లను మాత్రమే సెలక్ట్ చేసుకునే వెసులుబాటు వచ్చేసింది.
image:whatsapp
డేటా ఆన్ చేసి వాట్సాప్ యాప్ ఓపెన్ చేస్తే ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఇతరులకు తెలుస్తుంది. ప్రస్తుతం అలా తెలియకుండా ఉండే విధంగా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది.
image:whatsapp
కొన్ని గ్రూపులను కలిపి ఓ పెద్ద గ్రూపులా క్రియేట్ చేయడానికి ‘కమ్యూనిటీ’ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. అపార్ట్‌మెంట్లు, స్కూలు, కాలేజీ గ్రూపులను ఒకే చోట చేర్చడానికి ఇది ఉపయోగపడుతుంది.
image:whatsapp
ఏదైనా మెసేజ్‌కి రిప్లై ఇచ్చేలా ‘రియాక్ట్ విత్ ఎమోజీస్’ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని కోసం మెసేజ్ పక్కన ఉన్న ఎమోజీ క్లిక్ చేస్తే ముఖ్యమైన ఎమోజీలు ఉంటాయి.
image:whatsapp
గతంలో ఫొటోలు/ వీడియోలు ఫార్వర్డ్ చేసినప్పుడు దాని కింద ఇచ్చే టెక్స్ట్ వెళ్లేది కాదు. ఇప్పుడు ఆ ఫొటో/వీడియోతోపాటు టెక్స్ట్ కూడా వెళ్తుంది.
image:whatsapp
వాట్సాప్‌లో మన ‘వ్యూ వన్స్’ ఫీచర్‌తో పంపిన పొటోలు/వీడియోలను ఇతరులు మనకు తెలియకుండా స్క్రీన్ షాట్ ఇక తీయలేరు. సెట్టింగ్స్‌లో దీని ప్రైవసీ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.
image:whatsapp
వాట్సాప్ గ్రూప్‌ల నుంచి లెప్ట్ అయినప్పటికీ గ్రూప్ సభ్యులకు తెలియకుండా ఉండేలా సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. కానీ, గ్రూప్ అడ్మిన్‌కి మీరు లెఫ్ట్ అయినట్లు తెలుస్తుంది.
image:whatsapp
ఈ ఫీచర్లలో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా.. మరికొన్ని త్వరలోనే అందరికీ అప్‌డేట్‌గా రానున్నాయి.
image:whatsapp