షోయబ్‌తో వివాహం.. ఎవరీ సనా జావేద్..?

#eenadu

సనా జావేద్ ఉర్దూ టెలివిజన్‌లో కనిపించే పాకిస్థానీ నటి. 

షెహర్‌ -ఇ-జాత్‌ అనే రొమాంటిక్‌ సీరియల్‌తో నటనా రంగంలోకి అడుగు పెట్టిన ఆమె వరుసగా అవకాశాలు దక్కించుకుంది. 

దాదాపు పాతిక సీరియళ్లలో నటించిన ఆమె ‘రుస్వాయి’లో నటనకు గానూ ఉత్తమ నటి (క్రిటిక్స్‌)గా పీసా, పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డులను గెలుచుకుంది. 

‘బెహద్‌’, ‘షరీక్‌-ఇ-హయత్‌’, ‘డినో కి దుల్హనియా’, ‘ఐ లవ్‌ యూ జరా’ వంటి టెలీ ఫిల్మ్స్‌లోనూ నటించింది.  

సనా జావేద్‌ మార్చి 25, 1993న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించింది. ఆమె పూర్వీకులది హైదరాబాదే. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయారు. 

సనా తండ్రి వ్యాపారవేత్త కావడంతో ఆమె కుటుంబం జెడ్డా వెళ్లిపోయింది. అక్కడే ఆమె జన్మించింది. ఆ తర్వాత కుటుంబం లాహోర్‌కు వచ్చేసింది. 

సీరియళ్లలోనే కాదు, సినిమాల్లోనూ సనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2017లో వచ్చిన సోషియో కామెడీ ఫిల్మ్‌ ‘మెహరున్సీసా We Lub U’లో నటించింది. 

అక్టోబరు 2020లో సినీ గాయకుడు, గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను సనా వివాహం చేసుకుంది. ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు.

క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్ పరిచయమవ్వడం, వివిధ కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొనడంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వచ్చాయి. 

గతేడాది సనా బర్త్‌డే సందర్భంగా ఆమె ఫొటోను షోయబ్‌ పంచుకుంటూ ‘హ్యాపీ బర్త్‌డే బడ్డీ’ అంటూ పోస్ట్‌ పెట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

షోయబ్‌తో వివాహం తర్వాత తన సామాజిక మాధ్యమ ఖాతాల పేరును ‘సనా షోయబ్‌ మాలిక్‌’గా మార్చుకుంది.

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home