భూకంపాలకు కారణాలివీ!

తుర్కియే, సిరియాలో భూకంపం సృష్టించిన బీభత్సం ఇంకా అందరి కళ్లముందు కదలాడుతోంది. ఎప్పుడు భూమి కంపించినా ప్రజలు భయకంపితులవుతారు. అసలు భూకంపాలు ఎందుకొస్తాయో తెలుసుకోండి..!

Image:RKC

భూమి ఉపరితలం మీద ఉండే టేక్టానిక్‌ ప్లేట్స్‌లో అకస్మాత్తుగా కదలిక వచ్చినపుడు భారీగా శక్తి పుడుతుంది. ఆ శక్తి తరంగాలుగా భూమి మీదకు రావడంతో భూకంపం వస్తుంది.

Image:RKC

పర్యావరణం దెబ్బతిన్నా, భూగర్భజలాలు అతిగా దుర్వినియోగం చేసినా ఆ ప్రదేశాల్లో భూకంపం వచ్చే ప్రమాదం ఉంది.

Image:RKC

భూకంపాలను కొలిచే సాధనాన్ని సిస్మోగ్రాఫ్‌ అంటారు. దీన్ని తొలిసారిగా చైనాలో తయారు చేశారు. ఆ తర్వాత భూకంపాల తీవ్రతను అమెరికాకు చెందిన ఛార్లెస్‌ రిక్టర్‌ 1935లో కనుగొన్నారు. దాన్నే రిక్టర్‌ స్కేల్‌ అని పిలుస్తారు.

Image:RKC

సాధారణంగా భూకంపాల తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5 కంటే ఎక్కువగా ఉంటే ఆస్తి, ప్రాణ నష్టం ఉంటుందని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రదేశాల్లో అంతకన్నా తక్కువగా ఉన్నా నష్టం జరగొచ్చు.

Image:RKC

3,800 లీటర్ల పెట్రోల్‌ను మండిస్తే వచ్చే శక్తికి సమానమైన శక్తి భూకంపం వచ్చినపుడు విడుదలవుతుంది.

Image:RKC

రిక్టర్‌ స్కేల్‌పై 6 దాటితే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుంది. దీని ప్రభావం 30-40 కి.మీ వరకు ఉంటుంది.

Image:RKC

భూకంపాలు వచ్చినపుడు జంతువులు, పక్షులు ముందుగానే గుర్తిస్తాయి. వాటి అసహజ కదలికను గమనిస్తే ప్రకృతి విపత్తు రాబోతోందని అంచనా వేయొచ్చు.

Image:RKC

మన తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూకంపాలు వస్తున్నాయి. వాటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3లోపే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Image:RKC

బొగ్గు నిక్షేపాలున్న కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, రామగుండం లాంటి ప్రాంతాల్లో భూకంపాలను గుర్తించే విభాగాలను ఏర్పాటు చేశారు. 

Image:RKC

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home