ఇండియాకు +91 కోడ్‌ ఎలా వచ్చింది?

మన దేశంలో ప్రతి మొబైల్‌ నంబరుకు ముందు +91 కనిపిస్తుంటుంది.

ఇది మన దేశ కోడ్‌ అని అందరికీ తెలిసిందే. ఇంతకీ మనకు ఈ కోడ్‌ను కేటాయించడం వెనుక కారణం తెలుసా?

ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనిట్‌ (ITU) అన్ని దేశాలకూ ఇలాంటి కోడ్‌లను కేటాయిస్తుంటుంది.

ఏ దేశానికి చెందిన స్థానిక నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నా.. ఆ దేశానికి చెందిన కంట్రీ కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఐటీయూకు చెందిన కన్సల్టేటివ్‌ కమిటీ ప్రపంచాన్ని 9 వేర్వేరు జోన్‌లుగా విభజించి ఈ కోడ్‌ల జాబితాను రూపొందించింది.

జనాభా, ఆర్థిక వ్యవస్థ, కమ్యూనికేషన్ సంబంధిత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఐటీయూ ఈ కోడ్‌లను కేటాయిస్తుంది.

దక్షిణ, మధ్య, పశ్చిమాసియాతో పాటు మధ్యప్రాచ్య దేశాలు తొమ్మిదో జోన్‌ కిందకు వస్తాయి.

తొమ్మిదో జోన్‌లో ఉన్న అన్ని దేశాల కోడ్‌ 9తోనే ప్రారంభమవుతుంది. ఇండియాకు +91, పాకిస్థాన్‌కు +92, అఫ్గానిస్థాన్‌ +93 కేటాయించారు.

ప్రముఖ, అత్యంత జనాభా కలిగిన దేశాలకు తక్కువ డిజిట్‌ కలిగిన కోడ్‌ ఉంటుంది.. చిన్న దేశాలకు 3 అంకెల కోడ్ ఉంటుంది.

యూఎస్‌ (+1), యూఎస్‌ఎస్‌ఆర్‌ (+7)కు మాత్రమే సింగిల్‌ డిజిట్‌ కోడ్‌లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌ (+880), ఫిజీ (+679), కాంగో వంటి చిన్న దేశాలకు మూడంకెల కోడ్‌ ఉంటుంది.

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

Eenadu.net Home