విదేశీ టూర్‌లకు వెళ్తున్నారా? ఇది మర్చిపోకండి

విదేశీ టూర్‌లకు వెళ్లేవారు ప్రయాణ బీమా తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు అక్కడ అనుకోని సంఘటనలు ఎదురుకావొచ్చు.

Source:Pixabay

ఉదాహరణకు ఫ్లైట్‌ రద్దు కావడం, లగేజీ పొగొట్టుకోవడం లాంటివి. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా సహాయపడుతుంది.

Source:Pixabay

విదేశాల్లో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రయాణ బీమా మనల్ని ఆదుకుంటుంది. ఆస్పత్రి ఖర్చులతోపాటు మందులకు అయ్యే బిల్లును కూడా చెల్లిస్తారు.

Source:Pixabay

ఒక వేళ అనుకోని పరిస్థితుల్లో ప్రయాణికుడికి ఇంకేదైనా జరిగితే స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చులు సైతం బీమా కంపెనీలు భరిస్తాయి.

Source:Pixabay

ప్రయాణంలో ప్రమాదం వల్ల గాయాలపాలైతే క్షతగాత్రులకు బీమా కంపెనీలు ఆర్థిక అవసరాలకు తోడ్పాటునిస్తాయి. (ఒకవేళ మనకు ఆరోగ్య బీమా ఉన్నా విదేశాల్లో అది వర్తించకపోవచ్చు.) Source:Pixabay

ప్రయాణికులు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్‌ పోగొట్టుకుంటే డూప్లికేట్ లేదా కొత్త పాస్‌పోర్ట్‌ పొందేందుకయ్యే ఖర్చును బీమా కంపెనీలే అందిస్తాయి.

Source:Pixabay

ప్రయాణంలో మన లగేజీని పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఆ వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు అవసరమైన డబ్బును చెల్లిస్తాయి.

Source:Pixabay

బంగారం, ఖరీదైన వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు చెల్లించే దానికి పరిమితి ఉంటుంది. కొన్ని బీమా కంపెనీలు ఇలాంటి వాటిని బీమా పరిధిలోకి తీసుకురావు. పాలసీ ఎంచుకునే సమయంలో ఈ విషయాలను గమనించడం మంచిది.

Source:Pixabay

ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రయాణాన్ని వాయిదా లేదా రద్దు చేసుకుంటే హోటల్లో బస, భోజనం, మళ్లీ టికెట్ తీసుకునేందుకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీలే భరిస్తాయి.

Source:Pixabay

డబ్బు, కార్డులు ఉన్న పర్సు పోయినప్పుడు లేదా హఠాత్తుగా కార్డు పనిచేయకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లో బీమా కంపెనీ ఆసరాగా ఉంటుంది.

Source:Pixabay

ఆరోగ్య సమస్యలున్నా వైద్యుల సూచనలను పట్టించుకోకుండా ప్రయాణాలు చేయడం, ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం, యుద్ధం, ఉగ్రవాద చర్యలు, ప్రాణాంతక క్రీడల్లో పాల్గొనడం వంటివి పాలసీలో కవర్‌ కావు.

Source:Pixabay

ఇండియాకు +91 కోడ్‌ ఎలా వచ్చింది?

టెస్లా గురించి మీకివి తెలుసా?

ఈవీ విశేషాలు ఇవీ!

Eenadu.net Home