చలికాలంలో వ్యాయామం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

 ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలి. చలికాలంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా.. అలవాటు మానుకోకూడదు.

Image:RKC

జాగింగ్‌కు వెళ్లేటప్పుడు వెచ్చగా ఉండే దుస్తులు, మంకీ క్యాప్‌ ధరించండి.

Image:RKC

ఇంటిపక్కవారు, స్నేహితులతో కలిసి జాగింగ్‌కు వెళ్లండి. మాట్లాడుకుంటూ జాగింగ్‌ చేస్తుంటే చలి పెద్దగా ఇబ్బంది పెట్టదు.

Image:RKC

చలికాలంలో గాయాలు అంత తొందరగా మానవు. అందుకే, వ్యాయామం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

Image:RKC

కాస్త ఎండ వచ్చే ప్రదేశంలో (బాల్కనీల్లో, టెర్రస్‌) యోగా, ధ్యానం చేయండి. 

Image:RKC

బయట మరీ చలిగా ఉంటే.. ఇంట్లోనే స్కిప్పింగ్‌ చేయొచ్చు.

Image:RKC

ఇంట్లోని మెట్లు రెండు, మూడు సార్లు ఎక్కిదిగినా వ్యాయామం చేసినంత ఫలితమొస్తుంది. 

Image:RKC

చలికాలంలో నీరు ఎక్కువగా తాగాలి అనిపించదు. డీహైడ్రేట్‌ బారిన పడకూడదంటే తగినంత నీరు తాగాల్సిందే. గోరువెచ్చని నీరు తాగడం మంచిది. 

Image:RKC

ఈ కాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అందుకే, తరచూ శరీరానికి మాశ్చరైజర్‌ తప్పనిసరిగా రాసుకోవాలి.

Image:RKC

చలికి ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగుతుంటారు. ఎక్కువసార్లు తాగడం కూడా మంచిది కాదు. రోజుకి రెండు కప్పులకు పరిమితం చేసుకోండి.

Image:RKC

ఫొటోగ్రఫీ నిషేధించిన పర్యాటక ప్రాంతాలు..

మిస్‌ వరల్డ్‌ వైడ్‌ 2024.. #గుజరాత్‌ బ్యూటీ

నవ్వితే ఎన్ని లాభాలో..

Eenadu.net Home