భళారే వి‘చిత్రం’..

ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచీ రోజులో కనీసం ఒక్కసారైనా ఫొటో తీసుకుంటూనే ఉంటారు కదా..! ఈ మధ్య ఫొటోల ట్రెండ్‌ మరీ ఎక్కువైపోయింది. మూడ్‌కొక సెల్ఫీ తీసుకొని దాన్ని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆగస్టు 19న వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే.. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..

(photos:unsplash)

ఫొటోగ్రఫీ డేని 2010 నుంచి సెలబ్రేట్‌ చేసుకోవటం మొదలుపెట్టారు. ఆగస్టు 19, 2010న దాదాపు 270 మంది ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాలను గ్లోబల్ ఆన్‌లైన్‌ గ్యాలరీలో పంచుకున్నారు. 

ఫొటోగ్రఫీడేని.. మన ఫేవరెట్‌ ఫొటోని సోషల్‌మీడియా వేదికగా పంచుకొని, ఫ్యామిలీ ఫొటోలు తీసుకొని, ఫేమస్‌ ఫొటోగ్రాఫర్ల గురించి తెలుసుకుంటూ సెటబ్రేట్‌ చేసుకోవాలట..

ఫ్రెంచ్‌కి చెందిన లూయిస్‌ లె ప్రిన్స్‌, జర్మన్‌కి చెందిన జోహన్‌ జాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు 17వ శతాబ్దంలోనే కెమెరాని కనిపెట్టారు. కానీ ఆ తర్వాత దాంట్లో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తే తప్ప ఫొటో నెగెటివ్‌ రాలేదట.. 

భారత్‌కి 19శతాబ్దంలో బ్రిటిషువారు ఫొటోగ్రఫీని పరిచయం చేశారు. ఆ దేశానికి చెందిన ఫెలిస్‌ బీటో, సామ్యుల్‌ బోర్న్‌ అనే వ్యక్తులు కొన్నేళ్లపాటు ఇక్కడే బస చేసి ఇక్కడి పురాతన కట్టడాలను, సంప్రదాయాలను ఫొటోలు తీశారు.

స్వాతంత్య్రోద్యమ సమయంలో కుల్వంత్‌ రాయ్‌ ఆ పోరాటాల ఫొటోలు సేకరించి ఒక డాక్యుమెంటరీనే చేశారు. అలాగే మొదటి కలర్‌ ఫొటోని 1861లో తీశారట.

ప్రపంచంలోనే మొదటి చిత్రాన్ని డాగురేస్‌ పారిస్‌లో (1839) తీశారు. అనుకోకుండా తీసిన వీధి ఫొటోలో షూ పాలిష్‌ చేస్తున్న, చేయించుకుంటున్న ఇద్దరు వ్యక్తులు రికార్డ్‌ అయ్యారు. మొట్టమొదటి సారిగా మనుషులతో తీసిన ఫొటో అదే.. అంతకు ముందు ప్రకృతి తదితర పిక్స్‌ తీశారు.

ముంబయిలోని దిలిష్‌ పరేఖ్‌ వద్ద అధిక మొత్తంలో 4,425 కెమెరాల కలెక్షన్‌ ఉందట. ఇతనొక ఫొటో జర్నలిస్ట్‌.. యాంటిక్‌ కెమెరాస్‌ని సేకరిస్తూ ఉంటారు.

ఒక రోజులో దాదాపుగా 95 మిలియన్‌ ఫొటోలను ఇన్‌స్టాలో, 300 మిలియన్ల ఫొటోలను ఫేస్‌బుక్‌లోనూ అప్‌లోడ్‌ చేస్తున్నారట.

ప్రేమతత్వం గురించి చెబుతున్న సద్గురు

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

Eenadu.net Home