ఏసర్.. ప్రపంచంలోనే అత్యంత తేలికైన ల్యాప్‌టాప్!
ప్రపంచంలోనే అత్యంత తేలికైన ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది ఏసర్ సంస్థ. తాజాగా ‘స్విఫ్ట్ ఎడ్జ్’ ల్యాపీని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది.
Image: Acer
మెగ్నీషియం-అల్యూమినియంతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.17కిలోల బరువు మాత్రమే ఉంటుంది.
Image: Acer
ఈ ల్యాప్‌టాప్‌లో 4కే రెజల్యూషన్‌తో 16 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. విండోస్ 11తో ఇది పనిచేస్తుంది.
Image: Acer
ఏఎండీ రైజెన్ 6000, 6000 ప్రో ప్రాసెసర్స్ వాడారు. దీంతోపాటు రాడియన్ గ్రాఫిక్ కార్డు కూడా ఉంది.
Image: Acer
రెండు (16 జీబీ/32 జీబీ ర్యామ్) వేరియంట్లలో.. 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ల్యాప్‌టాప్స్ అందుబాటులోకి రానున్నాయి.
Image: Acer
యూజర్ సమాచార భద్రత కోసం బయోమెట్రిక్ ఆంథెటికేషన్‌తోపాటు మైక్రోసాఫ్ట్ ప్లూటన్ సెక్యూరిటీ చిప్‌ను అమర్చారు.
Image: Acer
దీనికి రెండు టైప్ సీ, రెండు టైప్ ఏ, ఒక హెచ్‌డీఎంఐ 2.1 పోర్టులు, 3.5ఎం.ఎం హెడ్‌ఫోన్ జాక్, ఒక మైక్రోఫోన్ ఉన్నాయి. వై-వై 6ఈ, బ్లూటూత్ 5.2 వైర్‌లెస్ కనెక్టివిటీ ఫీచర్లున్నాయి.
Image: Acer
ఇందులో 54WHr బ్యాటరీ ఉంది. త్వరలోనే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ ల్యాపీ ధర రూ. 1.24 లక్షలు ఉంటుందని అంచనా.
Image: Acer