షావోమి కొత్త ట్యాబ్‌.. ఇలానే ఉంటుందా?

షావోమి కంపెనీ ‘బుక్‌ ఎస్‌ 12.4’ పేరుతో 2-ఇన్‌-1 ట్యాబ్‌ను మన మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీన్ని ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లా వాడుకోవచ్చు.

Image: Xiaomi

ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో విడుదల చేసిన ఈ ట్యాబ్‌కు డిటాచబుల్ కీబోర్డ్‌‌, టచ్‌ పెన్‌ ఇస్తున్నారు. దీని డిస్‌ప్లేను 360 డిగ్రీల కోణంలో నచ్చిన వైపు తిప్పుకోవచ్చు.

Image: Xiaomi

ఈ ట్యాబ్‌ విండోస్‌ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8సీఎక్స్‌ జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

Image: Xiaomi

ఇందులో 60 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 12.4 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ ఇస్తున్నారు. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఉంది. Image: Xiaomi

వీడియో కాలింగ్‌ కోసం ముందు 1080 రిజల్యూషన్‌ కెమెరా, మైక్రోఫోన్‌ ఇస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ-సి టైప్‌ పోర్ట్‌, మైక్రోఎస్‌డీ స్లాట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Image: Xiaomi 

65 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ట్యాబ్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 13 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

Image: Xiaomi

 8జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లో తీసుకొస్తున్నారు. దీని ధర ₹ 50 వేల నుంచి ₹ 60 వేల మధ్య ఉంటుందని అంచనా.

Image: Xiaomi 

ఈ బుల్లి డివైజ్‌తో మీ పనులు మరింత స్మార్ట్‌..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్లు ట్రై చేశారా?

రియల్‌మీలో 12, 12+.. ఫీచర్లు ఇవిగో!

Eenadu.net Home