షావోమీ.. 200 / 108 ఎంపీ కెమెరాలతో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌!

షావోమీ కంపెనీ తాజాగా 12టీ, 12టీ ప్రో పేరుతో రెండు ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. వాటి వివరాలివీ..

Image: Xiaomi

షావోమీ 12 టీ ప్రో

ఈ మొబైల్‌ గోరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. రిఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌.

Image: Xiaomi

ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ 1 ప్రాసెసర్‌ను వాడారు. అలాగే 8 జీబీ ర్యామ్‌ / 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు.

Image: Xiaomi

వెనుకవైపు 200 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 20 ఎంపీ కెమెరా అమర్చారు. 8కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Xiaomi

ఈ మొబైల్‌లో 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. త్వరలో భారత మార్కెట్లోకి రానున్న దీని ధర రూ. 60వేలు ఉంటుందని అంచనా.

Image: Xiaomi

షావోమీ 12 టీ

ఇందులోనూ 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు.

Image: Xiaomi

మీడియాటెక్‌ డైమెన్సిటీ 8100 అల్ట్రా ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. 8 జీబీ ర్యామ్‌ / 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇస్తున్నారు.

Image: Xiaomi

వెనుకవైపు 108 ప్రధాన కెమెరా, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు అమర్చారు. ముందుభాగంలో 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Image: Xiaomi

బ్యాటరీ విషయానికొస్తే 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీని ధర రూ. 48 వేలు ఉంటుందని అంచనా.

Image: Xiaomi

షావోమీ టీ12 ప్రో, టీ12.. మోడల్స్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఎంఐయూఐ13 ఓఎస్‌తో పనిచేస్తాయి. బ్లూ, సిల్వర్‌, బ్లాక్‌ రంగుల్లో లభించనున్నాయి.

Image: Xiaomi

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home