200 ఎంపీ కెమెరా.. 120W ఫాస్ట్‌ఛార్జింగ్‌

రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌లో మూడు ఫోన్లను షావోమీ భారత మార్కెట్లో జనవరి 4న విడుదల చేసింది.

రెడ్‌మీ నోట్‌ 13, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ పేరిట ఈ మూడు ఫోన్లను లాంచ్‌ చేసింది. జనవరి 10 నుంచి విక్రయానికి వస్తున్నాయి.

రెడ్‌మీ నోట్‌ 13 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.19,999, 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.21,999.

ఇందులో 108 ఎంపీ ప్రధాన కెమెరా + 16 ఎంపీ సెల్ఫీ, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉన్నాయి.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.25,999. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.27,999, 12 జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.29,999.

200 ఎంపీ కెమెరా+ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉన్నాయి.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999, 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.33,999, 12జీబీ+512 జీబీ వేరియంట్‌ ధర రూ.35,999.

ఇందులోనూ 200 ఎంపీ ప్రధాన కెమెరా+ 16 ఎంపీ కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉన్నాయి.

ఈ ఫోన్లకు నాలుగేళ్ల సెక్యూరిటీ, మూడు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ (ఆండ్రాయిడ్‌ 16 వరకు) అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

Images: Redmi

పర్సే కాదు.. ఫోనూ లెదరే!

గూగుల్‌ మ్యాప్సే కాదు.. ఇవీ ఉన్నాయ్‌!

వీటితో డిజిటల్‌ అరెస్టుకు చెక్‌!

Eenadu.net Home