షావోమీ నుంచి మరో మూడు స్మార్ట్‌ టీవీలు!

షావోమీ తమ స్మార్ట్‌ టీవీ ఎక్స్‌ సిరీస్‌లో మూడు కొత్త టీవీలను లాంచ్‌ చేసింది.

Image: Xiaomi

మూడు వేరియంట్లలో (43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు) బేజిల్‌-లెస్‌ డిజైన్‌తో 4K రిజల్యూషన్‌తో డిస్‌ప్లే అందుబాటులోకి వస్తున్నాయి.

Image: Xiaomi

ఎక్స్‌ సిరీస్‌లో వచ్చిన ఈ మూడు వేరియంట్లలో డిస్‌ప్లే సైజు మినహా అన్ని ఫీచర్లు ఒకేలా ఉంటాయి. ప్యాచ్‌వాల్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 10తో పనిచేస్తాయి.

Image: Xiaomi

మూడు మోడల్స్‌లోనూ 33వాట్‌ స్పీకర్స్‌ ఉన్నాయి. డాల్బీ ఆడియో, టీటీఎస్‌-హెచ్‌డీ, టీటీఎస్‌ఎల్‌ ఎక్స్‌ టెక్నాలజీని సపోర్ట్‌ చేస్తూ థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.

Image: Xiaomi

క్వాడ్‌కోర్‌ A55 ప్రాసెసర్‌ను అమర్చిన ఈ టీవీల్లో 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు.

Image: Xiaomi

టీవీకి మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్స్‌, 2 యూఎస్‌బీ పోర్ట్స్‌, ఒక 3.5ఎం.ఎం ఆడియో జాక్‌ ఉన్నాయి. బ్లూటూత్‌ 5.0 వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఉంది.

Image: Xiaomi

ధరల విషయానికొస్తే.. 43 అంగుళాల టీవీ ధర రూ. 28,999 ఉండగా.. 50 అంగుళాల టీవీ ధర రూ. 34,999.. 55 అంగుళాల టీవీ ధర రూ. 39,999.

Image: Xiaomi

ఈ టీవీలు ఎంఐ వెబ్‌సైట్‌, ఎంఐ హోమ్స్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌లోనూ లభిస్తాయి.

Image: Xiaomi

భారత మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE

ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకండి!

ఫోన్‌ పోయిందా? డిజిటల్ యాప్స్‌ను బ్లాక్‌ చేశారా?

Eenadu.net Home