షావోమీ నుంచి కొత్త స్మార్ట్‌ టీవీ.. ఫీచర్లేమున్నాయంటే!

తాజాగా భారత మార్కెట్లోకి బడ్జెట్‌ ధరలో ‘షావోమీ స్మార్ట్‌ టీవీ 5ఏ ప్రో 32’ విడుదలైంది.

Image: Xiaomi

ప్రీమియం మెటల్‌ బెజెల్‌-లెస్‌ డిజైన్‌తో షావోమీ వివిడ్‌ పిక్చర్‌ ఇంజిన్‌తో కూడిన హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image: Xiaomi

ఇందులో క్వాడ్‌కోర్‌ కార్టెక్స్‌ ఏ55 సీపీయూతోపాటు మాలీ జీ31 ఎంపీ2 జీపీయూ ఉంది. 1.5జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు.

Image: Xiaomi

డాల్బీ ఆడియోని సపోర్ట్‌ చేసే డీటీఎస్‌:ఎక్స్‌ టెక్నాలజీ గల 24వాట్‌ స్పీకర్స్‌ ఉన్నాయి.

Image: Xiaomi

ఆండ్రాయిడ్‌ 11 ఓస్‌తో ఈ స్మార్ట్‌ టీవీ పనిచేస్తుంది. ఆటో లో లేటెన్సీ మోడ్‌, బ్లూటూత్‌ 5.0, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై కనెక్టివిటీ ఉన్నాయి.

Image: Xiaomi

2 హెచ్‌డీఎంఐ, 2 యూఎస్‌బీ పోర్టులు, ఈథర్నెట్‌, ఏవీ, ఒక హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉన్నాయి.

Image: Xiaomi

గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌తోపాటు క్రోమ్‌కాస్ట్‌ వెసులుబాటు ఈ టీవీలో ఉంది. ఇందులోని ప్యాట్చ్‌వాల్‌తో 30 కంటెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ను యాక్సెస్‌ చేసే వీలుంది.

Image: Xiaomi

ఈ స్మార్ట్‌ టీవీ ధర రూ. 16,999గా సంస్థ నిర్ణయించింది. ఎంఐ స్టోర్స్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయించనున్నారు.

Image: Xiaomi

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home