సింగిల్‌ ఛార్జ్‌తో 800KM.. షావోమీ తొలికారు విశేషాలివీ..

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ డిసెంబర్‌ 28న తొలి విద్యుత్‌ కారును ఆవిష్కరించింది.

ఎస్‌యూ7, ఎస్‌యూ 7 మ్యాక్స్‌ వేరియంట్లలో లభిస్తుంది.

ఎస్‌యూ 7 కారు.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 kmph.

ఎస్‌యూ7 మ్యాక్స్‌ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది.

ఒక్క ఛార్జింగ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. టాప్‌ స్పీడ్‌ 265 kmph.

అన్ని స్మార్ట్‌ఫోన్లతో కారును కనెక్ట్‌ చేసుకునే విధంగా ఇందులో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించారు.

ఈ కార్ల ధరలను ప్రకటించలేదు. ధర కాస్త అధికంగానే ఉంటుందని కంపెనీ సీఈఓ లీ జున్‌ తెలిపారు.

ఆక్వా బ్లూ, మినరల్‌ గ్రే, వెర్డంట్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home