ఎడమ చేత్తో అదరగొడతాడు..
క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి కొంత కాలమే అయినా సెంచరీలతో దుమ్ము దులిపేస్తున్నాడు ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన యశస్వి జైస్వాల్.. 2023 ఐపీఎల్‌లో రాణించి అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకున్నాడు ఈ కుర్రాడు..
image: instagram
ఉత్తర్‌ప్రదేశ్‌లో 2001లో పుట్టాడు జైస్వాల్. అతని పూర్తి పేరు యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్. తనది ఎడమ చేతి వాటం. బ్యాట్ పట్టుకొని తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్ బాదేస్తాడు.
image: instagram
జైస్వాల్‌కు 11 ఏళ్లు ఉన్నప్పుడు క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో కుటుంబాన్ని వదిలిపెట్టి ముంబయికి వచ్చాడు. దాదాపు మూడేళ్లు టెంట్‌లోనే ఉన్నాడు. అప్పుడు పానీపూరి అమ్మి జీవనం సాగించాడు. ఒక పూట తిన్నా.. క్రికెట్ ప్రాక్టీసు మాత్రం ఆపలేదు.
image: instagram
అలా మూడేళ్లు గడిచిన తర్వాత జ్వాలా సింగ్ అనే క్రికెట్ కోచ్ జైస్వాల్ టాలెంట్‌ని గుర్తించాడు. తను ఉండటానికి చోటు కల్పించడమే కాకుండా.. గార్డియన్‌గానూ, మెంటార్‌గానూ వ్యవహరించారు.
image: instagram
2015లో జరిగిన గైల్స్ షీల్డు మ్యాచ్‌లో 319 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
image: instagram
ముంబయి తరఫున 2019లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు మారిపోయాడు.
image: instagram
దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19లో భారత్ తరఫున ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచింది.
image: instagram
రంజీ ట్రోఫీ సీజన్‌లో (2021-22)వరసగా మూడు సెంచరీలు చేసి ముంబయిని ఫైనల్‌కు తీసుకొచ్చాడు. ఆ కరోనా సమయంలో తన టెక్నిక్స్ పెంచుకునేందుకు మరింత సమయాన్ని ప్రాక్టీస్‌కే వినియోగించాడట.
image: instagram
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇటీవల ముగిసిన(2023) సీజన్‌లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందెవరూ ఐపీఎల్‌లో ఇంత తక్కువ బంతుల్లో ఇలాంటి స్కోర్ చేయలేదు.
image: instagram
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 17వ భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. అంతే కాక ఆ మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 171 పరుగులు చేశాడు.
image: instagram
‘జట్టులో మంచి ఓపెనర్‌గా ఉండగలనని నమ్ముతున్నాను. ఇది నా కెరియర్ ఆరంభం మాత్రమే.. ఇదే వేగంతో, క్రమశిక్షణతో దూసుకెళ్లాలనుకుంటున్నాను. నా ప్రాక్టీసుపై నాకు ఆ నమ్మకం ఉంది’ అని జైస్వాల్‌లో ఓ సందర్భంలో చెప్పాడు.
image: instagram
This browser does not support the video element.
‘నిజానికి ఏ ఆట ఆడాలన్నా ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నేను ఆహారం తీసుకునేటప్పుడు నా నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అలా అయితేనే కెరీర్‌లో రాణించగలం’ అంటాడు ఈ యువ క్రికెటర్..
vedio:instagram
యశస్వి జైస్వాల్‌కి టూర్లకు వెళ్లడం.. ప్రకృతిని ఆస్వాదించడం అంటే చాలా ఇష్టమట. మ్యాచ్ నుంచి ఏ కాస్త సమయం దొరికినా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి సేదతీరుతూ ఉంటాడు.
image: instagram