మీ కంప్యూటర్‌ బాగుండాలంటే...!

మనం వాడుతున్న కంప్యూటర్‌ సురక్షితంగా ఉండాలనుకుంటాం.. కానీ అనుకోకుండా వైరస్‌ వస్తే సేకరించుకున్న డేటా అంతా మటాష్‌ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి...!

image:RKC

కంప్యూటర్లు పూర్తి రక్షణతో ఉండేందుకు యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలి. దాన్ని తరచుగా అప్‌డేట్‌ చేయాలి.

image:RKC

విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు ఉపయోగించే కంప్యూటర్లలోకి గేమ్స్‌,ఇతర సాఫ్ట్‌వేర్‌ సైట్లను డౌన్‌లోడ్‌ చేయకుండా ఉండాలి. సాధ్యమయినంత వరకు ఇతరుల పెన్‌డ్రైవ్‌ను ఉపయోగించొద్దు.

image:RKC

సీపీయూ ఎక్కువ కాలం మన్నికతో ఉండాలంటే కరెంటు హెచ్చుతగ్గులను తట్టుకోవడానికి యూపీఎస్‌ను వాడుకోవాలి. కరెంటుతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కంప్యూటర్‌ భద్రంగా ఉంటుంది.

image:RKC

వ్యక్తిగత కంప్యూటరయితే కచ్చితంగా పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. ఇతరులు వాడుకోవడానికి వీలుండదు. డేటా కూడా సురక్షితంగా ఉంటుంది.

image:RKC

మానిటర్‌, యూపీఎస్‌, సీపీయూ, కీబోర్డు, మౌస్‌లకు తడి అంటకుండా జాగ్రత్త పడాలి. నీటి బిందువులు పడితే అవి దెబ్బతినే అవకాశాలుంటాయి.

image:RKC

పీసీని తడిబట్టతో ఎప్పుడు తుడవద్దు. విద్యుత్తు ప్రవాహం ఉండటంతో షార్ట్‌సర్క్యూట్‌ అయ్యే ప్రమాదముంది. వీటిని శుభ్రం చేయడానికి కంప్యూటర్‌ క్లీనింగ్‌ లిక్విడ్‌ ఉపయోగించాలి.

image:RKC

మీ పనుల అవసరాలకు తగ్గ ర్యామ్‌, హార్డ్‌డిస్క్‌లను ఎంపిక చేసుకోవాలి. లేకపోతే తరచుగా కంప్యూటర్‌ మొరాయించే అవకాశం ఉంటుంది. పదే పదే రిస్టార్ట్‌ అయితే మాత్రం ర్యామ్‌లో లోపముందని అనుమానించాలి.

image:RKC

ఇంట్లో ఏసీ లేదని సీపీయూని తెరిచి ఉంచడం కొంతమందికి అలవాటు. కానీ ఇది సరికాదు. గాలి, దుమ్ముతో లోపలి భాగాలు పాడవుతాయి.

image:RKC

కంప్యూటర్లకు నెట్‌ కనెక్షన్ ఉన్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీ సమాచారం హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది. అనుమతి లేకుండా ఎవరూ మీ కంప్యూటర్‌ యాక్సెస్‌ చేయకుండా రక్షణ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి.

image:RKC

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home