నడకతోనే మీ స్వభావమేంటో చెప్పేయొచ్చు!

పిడికిలి బిగించి చేతిని శరీరానికి సమానంగా పెట్టి నడిచే వ్యక్తిలో ఆత్మాభిమానం ఉన్నట్లు తెలుస్తుంది. నమ్మిన విలువలకు కట్టుబడి ఉంటారు. ఇతరులు చెప్పేది వింటారు.. కానీ తమకు నచ్చిన పనే చేస్తారు.

Source: Pixabay

నడిచేటప్పుడు చేతులను ఊపుతూ నడిచే వాళ్లు చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు. స్వశక్తిపై ఆధారపడతారు. కొత్తగా ఆలోచిస్తుంటారు. ఇతరులతో ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడతారు.

Source: Pixabay

నేలను చూస్తూ నడిచేవారిలో నియంత్రణ లోపంతో పాటు నమ్మకం తక్కువగా ఉంటుంది. సమాజంతో కలిసి ఉండటానికి ఇష్టపడరు. వాళ్ల వాళ్ల సొంత ప్రపంచంలోనే విహరిస్తుంటారు.

Source: Pixabay

నడిచేటప్పుడు తలను, కళ్లను తిప్పుతూ ఉండే వాళ్లు ఎప్పుడూ కొత్త పని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఏ విషయంలోనైనా ధైర్యంగా ముందడుగు వేస్తారు. తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి నిరంతరం కృషి చేస్తుంటారు.

Source: Pixabay

చేసే పనికి సంబంధించిన వస్తువులను ఒక చేతిలో పెట్టుకొని నడిచే వారు ఆత్మాభిమానంతో పాటు తాము నమ్మిన విలువలకు కట్టుబడి ఉంటారు. ఇతరుల మాటలకు గౌరవమిచ్చినా తమకు నచ్చిన పనే చేస్తారు.

Source: Pixabay

వేగంగా నడిచే వారు అన్ని విషయాల్లో వెంటనే స్పందిస్తారు. కష్టాన్ని నమ్ముకుంటారు. దృష్టి చాలా సూటిగా ఉంటుంది. ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటారు.

Source: Pixabay

ఓ మోస్తరు వేగంతో నడిచే వారు జీవితంలో తీసుకునే నిర్ణయాలపై ఓపికతో వ్యవహరిస్తారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేసే సత్తా ఉంటుంది. కొద్ది సమయంలో తక్కువగా కష్టపడి ఎక్కువ లాభం పొందాలని బలంగా కోరుకుంటారు.

Source: Pixabay

నెమ్మదిగా నడిచేవారిలో బద్ధకం ఎక్కువ.. తమపై తమకు విశ్వాసం తక్కువగా ఉంటుంది. పక్క వాళ్లను చూసి తమ లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఏ విషయంపైనైనా దీర్ఘంగా ఆలోచిస్తారు.. పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరికి చదవడం, రాయడమంటే అమితాసక్తి.

Source: Pixabay

నడిచేటప్పుడు పాదాలను గట్టిగా వేస్తూ నడిచేవారు మొండిగా ఉండటంతో పాటు తమపై ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. తమను తాము ఎక్కువగా నమ్ముకునే వీళ్లు అందరిలో ఒకరిగా ఉండాలని కోరుకుంటారు.

Source: Pixabay

బుల్లి దేశం తువాలు విశేషాలెన్నో..

గూగుల్‌ డూడుల్‌ గమనించారా..!

సెక్సువల్‌ అసాల్ట్‌ అవేర్‌నెస్‌ మంత్‌

Eenadu.net Home