మోడలింగ్ కోసం డిగ్రీ వదిలేశా
నాగశౌర్య ‘రంగబలి’తో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన యుక్తి తరేజా ప్రస్తుతం ‘కె- ర్యాంప్’తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది.
ఇటీవల ‘క’తో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ‘కె- ర్యాంప్’లో హీరో. ఈ చిత్రంతో జెయిన్స్ నాని డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు.
యుక్తి విషయానికి వస్తే.. 2000లో హరియాణాలో పుట్టింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె చిన్నవయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది.
2017లో దిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో గెలిచింది. డిగ్రీ ఆఖరు సంవత్సరంలో ఎమ్‌టీవీ సూపర్ మోడల్ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.
మోడలింగ్ మీద ఆసక్తితో ఎలా అయినా ఆ టైటిల్ గెలవాలని డిగ్రీ పరీక్షలకు హాజరు కాకుండా అందాల పోటీల్లో పాల్గొని నాలుగో స్థానంలో నిలిచింది.
‘సినిమాల్లో నటిస్తానంటే.. అమ్మా నాన్న ఒప్పుకోలేదు. షూటింగ్‌లకు తీసుకెళ్లి పరిస్థితులను వివరించాక అంగీకరించారు’ అని ఓ సందర్బంలో చెప్పింది.
2023లో ‘రంగబలి’తో తెలుగు, 2024లో ‘మార్కో’తో మలయాళంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది.
బాలీవుడ్‌లో ‘గోట్స్’ వెబ్‌సిరీస్ షూటింగ్ జరుగుతోంది. దీంతో త్వరలో ఓటీటీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
‘ఇక్ సుప్నా’, ‘ససర్‌వాడి’, ‘లుట్ గయే’, ‘గల్తీ’ వంటి మ్యూజిక్ వీడియోల్లో ఆడిపాడింది.
ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామం చేస్తా.. కానీ అప్పుడప్పుడూ పిజ్జా, గార్లిక్ బ్రెడ్, బర్గర్లను లాగించేస్తానంటోంది.
రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె నటన అంటే ఇష్టపడుతుంది. ఖాళీ సమయం దొరికితే హార్స్ రైడింగ్ చేస్తుంది.
ఇన్‌స్టాలో సినిమా, పర్సనల్ అప్‌డేట్లను ఎక్కువగా పంచుకుంటుంది. ఈమె ఇన్‌స్టా ఖాతాకి 9లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల సినిమా ‘KJQ’, నిఖిల్ కుమారస్వామి హీరోగా ఓ కన్నడ చిత్రంలో నటిస్తోంది.