డెంటిస్ట్.. డ్యాన్సర్‌..

ఇప్పుడు హీరోయిన్‌

క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ వర్మ తెలుగు సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టనుందని వార్తలు వ్యాపిస్తున్నాయి.

దిల్‌ రాజు ‘ఆకాశం దాటి వస్తావా’ అనే సినిమా నిర్మిస్తున్నారు. భరతనాట్యం నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ధనశ్రీ డ్యాన్సర్‌గా కనిపించనుందని సమాచారం.

1996లో దుబాయిలో పుట్టిన ఈమె ముంబయిలో పెరిగింది. డెంటిస్టుగా డిగ్రీ పొందింది. ఇంటర్న్‌ డెంటిస్టుగా కొద్ది కాలం పని చేసింది.

డ్యాన్స్‌ అంటే చిన్నప్పట్నుంచి ఆసక్తి. భారతీయ ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ షియామక్‌ దావర్‌ వద్ద శిక్షణ తీసుకుంది.

2015లో ధనశ్రీవర్మ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టింది. ఈ ఛానల్‌కు 27లక్షలకు పైగా సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

‘కరోనా సమయంలో చాహల్‌ డ్యాన్స్‌ నేర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చాడు, రెండు నెలల తర్వాత నాకు ప్రపోజ్‌ చేశాడు.’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ధనశ్రీ. 

2020 డిసెంబర్‌లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాలో వీరి ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతూనే ఉంటాయి. 

ఖాళీ సమయం దొరికితే చాహల్‌- ధనశ్రీ బీచ్‌కి వెళ్లి సన్‌సెట్‌ని ఆస్వాదిస్తారు.

ఫిట్‌గా ఉండేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంది. తెల్లవారుజామునే లేచి జిమ్‌ చేస్తుంది.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home