కోహ్లీ ‘500’వ మ్యాచ్‌.. అంతకుముందు ఎవరంటే?

విండీస్‌తో జరగనున్న రెండో టెస్టు ‘కింగ్‌’ కోహ్లీకి అంతర్జాతీయంగా 500వ మ్యాచ్‌.  క్రికెట్‌ చరిత్రలో 500 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన పదో ఆటగాడు విరాట్ కోహ్లీ. అతడి కంటే ముందు ఎవరెవరున్నారంటే...

image: instagram

ఈ జాబితాలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ (664 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక టీ 20, 200 టెస్టులు, 463 వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. 

image: instagram

రెండో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్థెనె (652) ఉన్నాడు. 149 టెస్టులు, 448 వన్డేలు, 55 టీ 20లు ఆడాడు.

image: instagram

కుమార సంగక్కర (594) మూడో స్థానంలో నిలిచాడు. 134 టెస్టులు, 404 వన్డేలు, 56 టీ 20లు ఆడాడు.

image: instagram

లంక దిగ్గజం సనత్ జయసూర్య (586) నాలుగో స్థానంలో నిలిచాడు. ఇందులో 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టీ 20లు ఉన్నాయి.

image: instagram

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (560)ది ఐదో స్థానం. అతడు 168 టెస్టులు, 375 వన్డేలు, 17 టీ 20లు ఆడాడు.

image: instagram

‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (538) భారత్ నుంచి రెండో ఆటగాడు కాగా.. అంతర్జాతీయంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఇందులో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ 20లు ఉన్నాయి.

image: instagram

పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్ అఫ్రిది (524) కూడా భారీగానే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులు 27 కాగా.. 398 వన్డేలు, 99 టీ 20లు ఖాతాలో ఉన్నాయి. దీంతో అతడు ఏడో స్థానంలో నిలిచాడు.

image: instagram

దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ (519) ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టీ 20లు ఉన్నాయి.

image: instagram

టీమ్‌ ఇండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (509) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అతడు 164 టెస్టులు, 344 వన్డేలు, ఒక టీ 20తో మొత్తం 509 మ్యాచ్‌లు ఆడాడు.

image: instagram

భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (500*) విండీస్‌తో రెండో టెస్టుతో ఐదు వందల క్లబ్‌లోకి చేరతాడు. ఇందులో 111 టెస్టులు (విండీస్‌తో రెండో టెస్టు కలిపి), 274 వన్డేలు, 115 టీ 20లు ఉన్నాయి.

image: instagram

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home